హైదరాబాద్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): వ్యవసాయ శాఖలో బదిలీల వివాదం కోర్టుకు చేరింది. బదిలీల్లో తమకు అన్యాయం జరుగుతున్నదంటూ కొంతమంది అధికారులు కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే 42 మంది ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసినట్టు తెలిసింది. సీనియార్టీ జాబితా తప్పుల తడకగా ఉందంటూ కొందరు, బదిలీకి అవకాశం ఉన్నప్పటికీ బదిలీ చేయడం లేదంటూ మరికొందరు ఇలా ఒక్కొక్కరూ ఒక్కో కారణంతో కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే వ్యవసాయ శాఖలో బదిలీల గందరగోళం కొనసాగుతూనే ఉన్నది. బదిలీల ప్రక్రియ ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నప్పటికీ నేటికి పూర్తి కాలేదు. దీంతో ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.