హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : వచ్చే నెల 8 నుంచి 16 వరకు రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు.
అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్, స్టోర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత, ట్రేడ్స్మెన్లకు 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని డిఫెన్స్ విభాగం తెలిపింది. వివరాలకు 040-27740059, 27740205 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.