హైదరాబాద్, ఫిబ్రవరి 8(నమస్తేతెలంగాణ): మరో రెండురోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ల వారీగా 9 మంది నోడల్ ఆఫీసర్లను నియమించింది. ఈ మేరకు ఆదివారం టీజీఎస్ఈసీ సెక్రటరీ లింగ్యానాయక్ ఉత్తర్వులు జారీచేశారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 వరకు నోడల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో అకవతకవకలు, ఓటర్లకు ప్రలోభాలు ఇతరత్రా అంశాలపై ఫిర్యాదు చేయవచ్చునని, ఇందుకోసం 9247597066 కాల్ చేయాలని సూచించారు.