జనగామ: అగ్నిపథ్‌కు (Agnipath) వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశారు. రైల్వేస్టేషన్ విధ్వంస ఘటనలో తనపై కేసు పెడతారనే భయంతో.. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌కు చెందిన గోవింద్ అజయ్ అనే యువకుడు బలవన్నరణానికి ప్రయత్నించాడు. ఆందోళన సందర్భంగా అతడు ఓ టీవీ చానల్లో మాట్లాడాడు. ఈ నేపథ్యంలో తనపై పోలీసులు కేసు నమోదు చేస్తారేమోనన్న భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు.
గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని వరంగల్ ఎంజీఎం తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నది.