మహబూబాబాద్ : కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగు నీరు లేక ప్రజలు అల్లాడున్నారు. ప్రజల కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు తెచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ల కోసం(Drinking water) రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా మహబూబాబాద్ జిల్లా (Mahabubabad district)పెద్దవంగరలో మండలంలో తాగునీటి కోసం మహిళలు
వ్యవసాయ పొలాల వద్దకు వెళ్తున్నారు. పెద్ద వంగర మండల కేంద్రంలో కొన్ని నెలల నుంచి బోర్లు మరమ్మతులకు గురైన అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలతో రహదారిపై నిరసన(Agitation) వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ(Mission Bhagiratha,) నీళ్లు కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే బోర్లు మరమ్మతులు చేసి తాగు నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.