Sircilla | వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలోని దర్గాను కూల్చివేస్తామన్న అఘోరిని పోలీసులు అడ్డుకున్నారు. వేములవాడ వైపుగా బయలుదేరిన అఘోరిని తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామ శివారులో సోమవారం సాయంత్రం అడ్డుకున్నారు. అఘోరి కారులో నుంచి దిగకపోవడంతో అఘోరి వాహనాన్ని టోయింగ్ వ్యాన్ సహాయంతో బంధించి హైదరాబాద్ వైపుగా పోలీసులు తరలించారు. దర్గాను కూల్చి వేస్తానని అఘోరి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వేములవాడ పట్టణానికి నలువైపులా పోలీసులు మోహరించారు. అఘోరి అడ్డుకోవడంతో రోడ్డుపై భారీగానే ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. అదే సమయంలో అఘోరిని చూసేందుకు భారీగా జనం పోగయ్యారు. పోలీసులు అఘోరితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. దానికి అఘోరీ విముఖత చూపడంతో చేసేది లేక.. టోయింగ్ వ్యాన్ సహాయంతో కారును బంధించి హైదరాబాద్ మార్గంలో అఘోరీ కారును తరలించారు. కారును టోయింగ్ వాహనం లాక్కువెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.