లగచర్ల అంశంపై శాసనసభలో చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టింది. పర్యాటక శాఖపై కాకుండా లగచర్ల రైతుల బేడీల విషయంలో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. చర్చకు అనుమతించాలని ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు. ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల ఆందోళనతో శాసన సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ రేపటికి వాయిదా వేశారు.
లగచర్ల అంశంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనలతో అసెంబ్లీ దద్దరిల్లింది. లగచర్ల రైతులకు బేడీలు వేయడంపై శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. రైతులకు బేడీలు వేసిన ఫొటోలతో కూడిన ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. రైతులకు బేడీలు వేస్తారా సిగ్గు సిగ్గు అంటూ విమర్శించారు. బీఆర్ఎస్ ఆందోళనతో శాసన లాబీలో భారీగా మార్షల్స్ మోహరించారు. శాసనభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు పంపించేందుకు యత్నించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గలేదు. పర్యాటక శాఖపై కాకుండా లగచర్ల రైతుల బేడీల విషయంలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. లగచర్ల అంశంపై ఎందుకు చర్చ చేపట్టడం లేదని ప్రశ్నించారు. లగచర్ల అంశంపై చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. లగచర్ల రైతులకు బేడీల విషయంలో చర్చ చేపట్టాలని ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం దగ్గర ధర్నాకు దిగారు.
లగచర్ల బాధితులకు అండగా బీఆర్ఎస్
♦️లగచర్ల రైతులకు బేడీల విషయంలో ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
♦️శాసన సభలో కొనసాగుతున్న బీఆర్ఎస్ నిరసనలు.
♦️ఇదేం రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు.
♦️సభలో బీఆర్ఎస్ నిరసనల మధ్య సభను కొనసాగిస్తున్న… pic.twitter.com/wFOrFVGWYC
— BRS Party (@BRSparty) December 16, 2024
లగచర్ల రైతులకు బేడీల విషయంలో చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం దగ్గర ధర్నాకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. pic.twitter.com/KBWXUyWV2V
— Office of Harish Rao (@HarishRaoOffice) December 16, 2024