గుమ్మడిదల,ఆగస్టు15: తమ పంటపొలాల్లోకి రసాయన వ్యర్థజలాలు వదలడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధిత రైతులు పరిశ్రమ గేటు ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలోని మైత్రి డగ్స్ పరిశ్రమ నుంచి వ్యర్థజలాలు ఔట్లెట్ ద్వారా వదలడంతో దిగువ భాగంలో ఉన్న గుమ్మడిదలకు చెందిన పడమటి మల్లారెడ్డి, పడమటి లక్ష్మారెడ్డి, మల్లవరం వీరారెడ్డి, థామస్‌రెడ్డి పంటపొలాలు రసాయన వ్యర్థజలాలతో నిండిపోయాయి. దీంతో పరిశ్రమ గేటు ఎదుట ఆందోళన చేశా రు. ఎస్సై లక్ష్మీకాంత్‌రెడ్డి, తహసీల్దార్ పరమే శం, ఆర్ఐ పవన్ ఘటనా స్థలానికి చేరుకుని వ్యర్థజలాల నమూనాలను పరిశీలించారు.