హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్‌లోని పిల్లర్ కుంగుబాటుకు కారణాలను ఇప్పుడే చెప్పలేమని ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన ఏఈఈలు, డీఈఈలు స్పష్టం చేశారు. భూగర్భ పరీక్షలతోపాటు ఇతర పరీక్షలన్నీ పూర్తయ్యాక స్పష్టత వస్తుందని జస్టిస్ ఘోష్ కమిషన్‌కు తెలిపారు. ప్రాజెక్టుపై విచారణ కమిషన్ సోమవారం బీఆర్కే భవన్లో విచారణ కొనసాగించింది. ఆ మూడు బరాజ్‌ల నిర్మాణంలో పా ల్గొన్న దాదాపు 18 మంది ఏఈఈలు, డీఈఈలను జస్టిస్ ఘోష్ వివిధ అంశాలపై ప్రశ్నించారు.
వర్క్ ప్లేస్మెంట్ రిజిస్టర్లు, ఎంబీ రికార్డుల్లోని వివరాలపై ఆరా తీశారు. క్వాలిటీ కం ట్రోల్ పరీక్షల్లో లోపాలేమైన గుర్తించారా? అ ని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, అన్నీ సజావుగానే కొనసాగాయని ఇంజినీర్లు వివరించారు. అనంతరం జస్టిస్ ఘోష్ మేడిగడ్డ 7వ బ్లాక్‌తోపాటు మూడు బరాజ్‌ల వర్ ప్లేస్మెంట్ రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నా రు. వాటిపై ఇంజినీర్ల సంతకాలు తీసుకున్నా రు. జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ మంగళవారం కూడా కొనసాగనున్నది.