మంత్రి కొప్పులకు తీర్మాన ప్రతి అందజేత
జమ్మికుంట, సెప్టెంబర్ 4: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్లోని అడ్తిదారుల సంఘం, గుమస్తాల సంఘాలు టీఆర్ఎస్కే జైకొట్టా యి. ఈ మేరకు నాయకులు, సభ్యు లు పట్టణంలో శనివారం ఏకగ్రీవ తీర్మానం చేసి, ఆ ప్రతిని మంత్రి కొప్పుల ఈశ్వర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావుకు అందజేశారు. సంక్షేమం, అభివృధ్ధిని పరుగులు పెట్టిస్తున్న టీఆర్ఎస్కు మద్దతుగా ఉంటామని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జమ్మికుంట పట్టణ పరిధిలోని ధర్మారంలో పర్యటించిన మంత్రి కొప్పుల గౌడ సంఘం నాయకులతో సమావేశమయ్యారు. గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.20 లక్షల నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని వారికి అందజేశారు.
టీఆర్ఎస్లో చేరికలు
జమ్మికుంట పట్టణంలోని ధర్మారానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, హనుమాన్ యూత్ సభ్యులు తదితరులు వంద మంది మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.