హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని మహిళా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ మేరకు సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిణి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 2025-26 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం ఇంగ్లిష్ మీడియంలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. పూర్తి వివరాలకు సొసైటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని వెల్లడించారు.
జేఈఈ ఫలితాల్లో ర్యాంకులు సొంతం చేసుకున్న గురుకుల విద్యార్థులను సెక్రటరీ వర్షిణి ప్రత్యేకంగా అభినందించారు. సంస్థ కార్యాలయంలో విద్యార్థుల సక్సెస్ మీట్‌ను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రత్యేకంగా సత్కరించారు.