నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 18: బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబీ కండువాలు కప్పుకొంటున్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లోని హబీబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హరూన్, రషీద్, హంజారషీద్, షారూఖ్, ఫిరోజ్, అజీజ్, షేక్‌మస్తాన్, జైనాబేగంతోపాటు మరో వందమంది మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
నిజామాబాద్ నగరంలో రజక జన సేవా సంఘం సభ్యులు 150మంది అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సమక్షంలో, యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని మగ్దుంపల్లిలో 50 మంది యువకులు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సమక్షంలో, నల్లగొండ జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన 50 కుటుంబాల వారు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి సమక్షంలో ఆలేరుకు చెందిన 300 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గులాబీ కండువాలు కప్పుకొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఉడిత్యాల గ్రామానికి చెందిన 60 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు జడ్చర ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో, నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రానికి చెందిన 30 మంది లిటిల్ సోల్జర్ యూత్ సభ్యులు, 20 మంది వివిధ పార్టీల నాయకులు కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.