హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, వరంగల్‌లోని టీజీఎస్ఆర్టీసీ ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. అర్హత కలిగిన విద్యార్థులు జూన్ 10లోపు ఆన్లైన్ (http//iti.telangana.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మోటార్‌మెకానిక్ వెహికిల్, మెకానిక్డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్లలో ప్రవేశాలు జరుగుతున్నట్టు తెలిపింది.
ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీజీఎస్ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్‌షిప్ సౌకర్యం కల్పిస్తున్నట్టు పేర్కొంది. వివరాల కోసం హైదరాబాద్ ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లు 9100664452, 040-23450033, వరంగల్ ఐటీఐ కళాశాల ఫోన్‌నంబర్లు 9849425319, 8008136611ను సంప్రదించాలని తెలిపింది. పూర్తివివరాలను http//iti.telangana.gov.in వెబ్సైట్లోనూ చూడొచ్చని పేర్కొంది.