వీఆర్వో వ్యవస్థ రద్దుపై కేసుల్లో తీర్పు వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను రద్దు పరిచి వారిని ఇతర శాఖల్లోకి బదలాయింపునకు వీలు కల్పించిన జీవోను సవాల్ చేసిన పిటిషన్లపై వాదనలు ముగిశాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను రద్దు పరిచి వారిని ఇతర శాఖల్లోకి బదలాయింపునకు వీలు కల్పించిన జీవోను సవాల్ చేసిన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. తీర్పును తర్వాత వెలువరిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. చట్ట వ్యతిరేకంగా వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చేసిన వాదనలను ప్రభుత్వం వ్యతిరేకించింది.
వీఆర్వో వ్యవస్థ లేకపోవడం వల్ల రెవెన్యూశాఖ పనులు ఏమీ ఆగలేదని చెప్పింది. రెవెన్యూశాఖను డిజిటలైజేషన్ చేయడంతోపాటు ధరణి పోర్టల్ను ప్రారంభించినట్టు తెలిపింది. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి వాళ్లను ఇండ్ల్లకు పంపలేదని, వేరే ప్రభుత్వశాఖల్లోకి సర్దుబాటు చేసిందని వివరించింది. వారికి జీతభత్యాలు మొదలైనవి చెల్లింపుల విషయంలో నష్టం ఏమీ చేకూరలేదని చెప్పింది. తీర్పును వాయిదా వేసిన హైకోర్టు.. ఇంకా ఎవరైనా వాదనలు చెప్పదలిస్తే రాతపూర్వకంగా ఈ నెల 28లోగా నివేదించాలని కోరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

