ఆదిలాబాద్ : లంబాడీలను(Lambadis) ఎస్టీ జాబితా నుంచి(ST list) తొలగించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం ఆదిలాబాద్ ఆర్టీసీ బస్సు స్టాండ్ వద్ద ఆదివాసీలతో కలిసి ధర్నా(Adivasis dharna) నిర్వహించారు. ఈ సంద్భంగా అయన మాట్లాడుతూ.. జీవో నంబర్ 3ని యథావిధిగా కొనసాగించాలన్నారు. వలస లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్నారు.
విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఎంతో వెనుకబడిన ఆదివాసీలకు న్యాయం జరుగాలంటే లంబాడీలను ఎస్టీ జాబితా నుంచే తొలగించాలన్నారు. కాగా, రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏజెన్సీ బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Devara | దేవర మ్యాడ్నెస్.. డిఫరెంట్ షేడ్స్‌లో తారక్ నయా లుక్ అదిరిందంతే..!
Lal Salaam | సస్పెన్స్ వీడింది.. ఫైనల్‌గా ఓటీటీలోకి రజినీకాంత్ లాల్ సలామ్..!
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్ మారథాన్ షెడ్యూల్ షురూ.. ఎక్కడంటే..?
Game Changer | ఫైనల్‌గా రాంచరణ్ గేమ్‌ఛేంజర్ విడుదల తేదీపై క్లారిటీ.. ఎప్పుడో తెలుసా..?