సోయా పంటను అమ్మేసిన రెండురోజులకు.. నాణ్యత లేదంటూ తిప్పి పంపడాన్ని రైతులు అవమానంగా భావించారు. పంట కొనుగోళ్లలో ప్రభుత్వ అసమర్థతకు నిరసనగా బేల మార్కెట్లో సోమవారం ఇలా మోకాళ్లపై కూర్చొని, చెవులు పట్టుకొని నిరసన తెలిపారు.
ఆదిలాబాద్, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా బేల మా ర్కెట్లో సోయా రైతులు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. 20 రోజుల క్రితం రెండు వేల క్వింటాళ్ల సోయా పంటను బేల మార్కెట్ యార్డుకు తీ సుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ కోటా ముగియడంతో మార్క్ఫెడ్ అధికారులు పంట ను తీసుకునేందుకు నిరాకరించారు. రైతుల ఆందోళనతో కాంటా వేసి గోదాములకు తరలించారు. అయితే నాణ్యత బాగాలేదని, నిల్వ చేసుకొనేందుకు తిరస్కరించారు. దీంతో 2వేల క్వింటాళ్ల సోయాబీన్ తిరిగి యార్డుకు తరలించారు.
నాఫెడ్ తిరస్కరణతో రైతులకు పంట డబ్బులు వచ్చే అవకాశం లేదు. అధికారులు చేతులెత్తేయడంతో ఆందోళన చెందిన రైతులు సోమవారం బేల మార్కెట్కు చేరుకొని పంటపై మోకాళ్లపై కూర్చొని చెవులు పట్టుకొని నిరసన తెలిపారు. తాము పంటను తీసుకొచ్చి తప్పు చేశామని, రైతులకు ఇలాంటి అవమానం ఎప్పుడు జరుగలేదని ఆవేదన చెందారు. పంటను తెచ్చినందుకు ప్రభుత్వం క్షమించాలని కో రారు. సోయాను తిరిగి తమ ఇండ్లకు తీసుకుపోయారు.