ప్రపంచ వేడి నగరాల్లో ఆదిలాబాద్, హైదరాబాద్
రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత ప్రపంచ రికార్డు నమోదు చేస్తోంది. ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా ఆదిలాబాద్, హైదరాబాద్ నిలిచాయి. అమెరికాకు చెందిన ప్రముఖ వాతావరణ సంస్థ ఎల్డోరాడో వెదర్ రూపొందించిన నివేదికలో ప్రపంచంలోని 100 అత్యంత వేడి నగరాల జాబితాలో ఆదిలాబాద్ చేరింది.
- అధిక ఉష్ణోగ్రతలు నమోదైన జాబితాలో 14వ స్థానం
- 45 డిగ్రీలతో మహారాష్ట్రలోని అకోలాకు అగ్రస్థానం
- ప్రముఖ వాతావరణ సంస్థ ఎల్డోరాడో వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత ప్రపంచ రికార్డు నమోదు చేస్తోంది. ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా ఆదిలాబాద్, హైదరాబాద్ నిలిచాయి. అమెరికాకు చెందిన ప్రముఖ వాతావరణ సంస్థ ఎల్డోరాడో వెదర్ రూపొందించిన నివేదికలో ప్రపంచంలోని 100 అత్యంత వేడి నగరాల జాబితాలో ఆదిలాబాద్ చేరింది. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేడి నమోదైన నగరాల్లో ఆదిలాబాద్ 14వ స్థానంలో నిలవడం గమనార్హం. మహారాష్ట్రలోని అకోలా 45 డిగ్రీలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో కొత్తగూడెంలో 43.3, గద్వాల 43.3, నిర్మల్ 43.0, నిజామాబాద్ 43.0 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
గ్లోబల్ హీట్ లిస్టులో హైదరాబాద్ ప్రాంతాలు..
కేవలం ఆదిలాబాద్ మాత్రమే కాకుండా.. హైదరాబాద్లోని కొత్తపేట తదితర పట్టణ ప్రాంతాలు కూడా గ్లోబల్ హీట్ లిస్టులో చేరడం ఆందోళన కలిస్తున్నట్లు ఎల్డోరాడో వెల్లడించింది. మూసీ నది పరీవాహక ప్రాంతంలో ఉండటం, భూగర్భ జలాలు పడిపోవడంతో ఇకడ వేడి ఎకువగా నమోదవుతున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. సోమవారం హైదరాబాద్ సరూర్నగర్ సరిల్లోని న్యూ నాగోల్ ప్రాంతంలో 41.7 డిగ్రీల సెల్సియస్, ముషీరాబాద్ ప్రాంతంలో 41.6 డిగ్రీల సెల్సియస్, అంబర్ పేట 41.4. మలాజిగిరి 41.3, ఎల్బీనగర్, 41.3, మొహిదిపట్నం 41.1 డిగ్రీ సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

