BRS | కాంగ్రెస్ పాలనపై ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారనేది మరోసారి రుజువైంది. అధికార పార్టీపై వ్యతిరేకతతో ఎవరో ఒకరిద్దరు కాదు.. ఏకంగా గ్రామమంతా ఒక్కటై బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పట్నంగూడ గ్రామస్తులు సోమవారం నాడు గులాబీ కండువా కప్పుకున్నారు.
బీఆర్ఎస్ నేత అనిల్ జాదవ్ సమక్షంలో పట్నంగూడ గ్రామస్తులందరూ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా డప్పుల సప్పుడుకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని.. తమ పోడు పట్టాలు అందుతాయనే నమ్మకం కలిగిందని గ్రామస్తులు ఈ సందర్భంగా తెలిపారు.
ఊరు ఊరంతా బీఆర్ఎస్ పార్టీలో చేరడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఏకతాటిపై నిలిచి, గులాబీ జెండాకు జై కొడుతూ.. కేసీఆర్ బాటలో నడిచేందుకు బీఆర్ఎస్ పార్టీలో చేరిన పట్నంగూడ గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.