Adibatla | హైదరాబాద్ : మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇవాళ సోదాలు చేశారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్, అసిస్టెంట్ వంశీ కలిసి రూ. 75 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇల్లు నిర్మాణానికి పర్మిషన్ నిమిత్తం ఈ డబ్బులు వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు.