వరంగల్ : ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు 16న అడిషనల్ మాప్ అప్ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. నీట్ ఎండీఎస్ కట్ ఆఫ్ స్కోర్ తగ్గిన నేపథ్యంలో ఇప్పటికే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి మెరిట్ జాబితాను యూనివర్సిటీ విడుదల చేసింది.
ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం అడిషనల్ మాప్ అప్ నోటిఫికేషన్ను జారీ చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని మిగిలిపోయిన కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ నెల 16వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అదే రోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ కోరింది. గత విడత కౌన్సెలింగ్లో సీటు అలాట్ అయి జాయిన్ కానీ అభ్యర్థులు, అదే విధంగా కళాశాలలో చేరి డిస్కంటిన్యూ చేసిన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్కు అనర్హులని వర్సిటీ ప్రకటించింది. మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్సైట్ను చూడాలని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి.
ఇవి కూడా చదవండి..
సల్మాన్ ఖుర్షీద్ ఇంటికి నిప్పు.. ఇది హిందూయిజం కాదని వ్యాఖ్య
Home Loans Best Time | ఇండ్ల కొనుగోలుకు ఇదే బెస్ట్ టైం.. ఈ బ్యాంకుల్లో మరింత తగ్గిన వడ్డీరేట్లు
Bjp | బీజేపీ నేతలపై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్