హైదరాబాద్: కరోనా సంక్షోభం ఒకవైపు సామాన్యులను పేదరికంలోకి నెట్టేస్తే, మోదీ దోస్తులను మాత్రం మరింత సిరిమంతులుగా మార్చింది. అవును.. లాక్డౌన్ సమయంలో 5.6 కోట్ల మంది భారతీయులు పేదరికంలోకి దిగజారగా.. అదానీ, అంబానీల ఆదాయంలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు, ఐఐఎఫ్ఎల్ నివేదికల్లో ఈ విషయం వెల్లడైంది.