జగిత్యాల : కొండగట్టు ఆంజనేయస్వామివారిని ప్రముఖ హాస్యనటి గీతా సింగ్, కళాశ్రీ అధినేతి గుండేటి రాజు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో విశేష పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు గీతాసింగ్తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. కార్యక్రమంలో కళాశ్రీ అధినేత గుండేటి రాజు, ఆలయ డైరెక్టర్ లింగాగౌడ్, వేదపండితులు కపిల్ స్వామి, పవన్ స్వామి తదితరులు పాల్గొన్నారు.