యాదగిరిగుట్ట, అక్టోబర్ 17: యాదగిరిగుట్ట ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ సినీ నటుడు సుమన్ కితాబునిచ్చారు. గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణ సమయంలో స్వామివారి దర్శించుకున్నానని, ఆలయ పునఃప్రారంభమైన అనంతరం మొదటిసారిగా వచ్చానని తెలిపారు. గతంతో పోలిస్తే ఆలయం ఎందో అద్భుతంగా కనిపిస్తున్నదని తెలిపి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో లక్ష్మీనరసింహస్వామి అంటే యాదగిరిగుట్ట ఆలయమే అని చర్చించుకునే స్థాయిలో ఉందని తెలిపారు.