హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ అందిస్తున్న సేవలను, సంస్థ కార్యకలాపాలను బాలకృష్ణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు వివరించారు.
అంతే గాకుండా హాస్పిటల్ అభివృద్దికి సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి బాలయ్య తీసుకొచ్చారు. ప్రభుత్వం నుంచి తగిన మద్దతు ఇవ్వాలని హరీశ్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. బాలకృష్ణ విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటూ డాక్టర్ ఆర్ వి ప్రభాకర రావు కూడా పాల్గొన్నారు.