హైదరాబాద్ : టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. సామాన్యుల నుంచి మహామహులను కదిలించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ పాల్గొన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య, ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి అమీర్‌ఖాన్ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా అమీర్‌ఖాన్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలన్నారు. అప్పుడే మన భవిష్యత్ తరాలకు మంచి జీవితాన్ని ఇచ్చినవాళ్లం అవుతామన్నారు. దీన్ని ఒక కార్యక్రమంగా కాకుండా, నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని అమీర్‌ఖాన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావు, రాఘవ తదితరులు పాల్గొన్నారు.
Presented #AmirKhan ji with the much acclaimed #VrukshaVedam book, which draw the attention of him and felt happy to have it. Few more glimpses of today’s programme 👇. #GreenIndiaChallenge 🌱. pic.twitter.com/KzWLQDaieK
— Santosh Kumar J (@MPsantoshtrs) September 19, 2021