ఖమ్మం, జూన్ 27 : ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఖమ్మంలో శుక్రవారం ధర్నా నిర్వహించి.. రాస్తారోకో చేపట్టారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కేవీ కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం, పెన్షన్, హెల్త్ కార్డుల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, లేదంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.