బోధన్, మే 16: సీనియర్ జర్నలిస్టులతో అనుచితంగా వ్యవహరించిన టిప్పర్లు, ట్రాక్టర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బోధన్‌లో జర్నలిస్టులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఇసుక అక్రమరవాణా, తవ్వకాలపై ప్రత్యేక కథనం రాసినందుకు బోధన్ ‘నమస్తే తెలంగాణ’ ఆర్సీ ఇన్చార్జి బలరామరాజు, టీన్యూస్ రిపోర్టర్ తారాచంద్ దిష్టిబొమ్మలను టిప్పర్ల యజమానులు, ట్రాక్టర్ల డ్రైవర్లు బుధవారం దహనంచేసిన విషయం తెలిసిందే.
నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక రవాణాచేసే వాహనాల యజమానులు ఇద్దరు సీనియర్ జర్నలిస్టులతో అనుచితంగా వ్యవహరించడంపై జర్నలిస్టులు బోధన్ సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బోధన్ సబ్‌కలెక్టర్ వికాస్ మహతోకు, బోధన్ ఎస్‌హెచ్‌వో వెంకటనారాయణకు వినతిపత్రం అందజేశారు. బోధన్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు రవికుమార్, మాజీ ప్రధాన కార్యదర్శిశ్రీనివాస్, మాజీగౌరవాధ్యక్షుడు గంగు లు, ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.