యువతిని హత్య చేసిన నిందితుడి మృతి
ప్రేమించలేదని యువతిని కత్తితో గొంతుకోసి హత్య చేయగా.. స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రేమోన్మాది దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
- పారిపోతుండగా స్థానికుల దాడి
- చికిత్స పొందుతూ మణితేజ మృతి
జడ్చర్లటౌన్, మే 17 : ప్రేమించలేదని యువతిని కత్తితో గొంతుకోసి హత్య చేయగా.. స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రేమోన్మాది దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. వివరాలు ఇలా.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని నిమ్మబావిగడ్డ ప్రాంతంలో నివాసముంటున్న వైష్ణవి(24)ని ఓ యువకుడు కత్తితో హత్యచేసి పారిపోతున్న క్రమంలో స్థానికులు పట్టుకొని చితకబాదారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.
యువతిని హత్య చేసిన యువకుడు హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన మణితేజ(29)గా గుర్తించారు. లాండ్రీ షాపు నిర్వహిస్తున్న మణితేజ కొన్నాళ్లుగా జడ్చర్లకు చెందిన వైష్ణవిని ప్రేమపేరుతో వేధిస్తుండగా, సదరు యువతి తిరస్కరించినట్టు సమాచారం. వైష్ణవికి మరొకరితో పెండ్లి సంబంధం కుదిరిన విషయం తెలుసుకున్న మణితేజ మరింత కక్ష పెంచుకొని శనివారం సాయంత్రం జడ్చర్లలోని నిమ్మబావిగడ్డ ప్రాంతంలో ఒంటరిగా ఇంటికి వెళ్తున్న వైష్ణవిని అడ్డగించి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

