Diesel Scam | వరంగల్, డిసెంబర్ 7: ‘అన్యాయంగా డీజిల్ స్కాంలో ఇరికించారు. మానసిక వేదనకు గురిచేశారు. చివరికి ఊపిరి తీశారు’.. అంటూ డీజిల్ స్కాం లో రెండేళ్ల క్రితం సస్పెండ్‌కు గురైన కనకం రఘు కుటుంబ సభ్యులు ఆరోపించారు. శనివారం గుండెపోటుతో మృతి చెందిన రఘు (50) మృతదేహంతో బల్దియా ఎదుట ఆందోళనకు దిగారు.
రెండున్నరేళ్ల కిత్రం బల్దియా లో రూ.40 లక్షల డీజిల్ కుంభకోణంలో డీజిల్ ఇన్చార్జిగా ఉన్న పీహెచ్ వర్కర్ రఘు ప్రమేయం ఉందన్న ఆ రోపణలతో అధికారులు సస్పెండ్ చేశా రు. దీంతో రఘు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉద్యోగంలోకి తీసుకోవాలని ఇటీవల ఆదేశించినా అధికారులు పట్టించుకోకుండా నెల రోజుల కిత్రం క్రిమినల్ కేసు పెట్టారు. దీంతో మానసిక వేదనకు గురైన రఘు గుండెపోటు తో మరణించినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కుటుంబసభ్యులతో అదనపు కమిషనర్ జోనా చర్చలు జరిపారు. న్యాయం చేస్తామని, ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా కమిషనర్ దృష్టికి తీసుకపోతానని హామీ ఇచ్చారు.