హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): డ్రోన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో ఉద్యాన ఉత్పత్తిలో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చని ఆచార్య కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ డాక్టర్ దండా రాజిరెడ్డి తెలిపారు.
పంటలపై పరిశోధన, అభివృద్ధి, శిక్షణలో సహకారానికి ఉద్యాన వర్సిటీ, మారుత్ డ్రోన్స్ సంస్థ మధ్య గురువా రం అవగాహన ఒప్పందం కుదిరింది. ములుగు ఉద్యాన వర్సిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాజిరెడ్డి, మారుత్ డ్రోన్స్ సంస్థ ప్రతినిధి పరస్పరం ఒప్పంద సంతకాలు చేశారు.