హైదరాబాద్, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ): జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డుల జారీకి మరో రెండు నెలల సమయం పట్టనున్నది. దీంతో ప్రస్తుత కార్డుల గడువును ఫిబ్రవరి 28 వరకు అధికారులు పొడిగించారు. అలాగే బస్‌పాస్‌ల గడువును కూడా ఫిబ్రవరి చివరి వరకు పొడిగించాలని నిర్ణయించారు.
ఈ మేరకు ప్రస్తుత కార్డులపైనే ఫిబ్రవరి 28వ తేదీ వరకు బస్‌పాస్‌లు జారీ చేయాలని సమాచార, ప్రజాసంబంధాల శాఖ కమిషనర్ మం గళవారం టీజీఆర్టీసీ ఎండీకి లేఖ రా శారు. కాగా, జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల గడువు ఈనెల 31తో ముగుస్తున్నది. కొత్త కార్డుల కోసం ఆన్లైన్ ద్వా రా దరఖాస్తు చేసుకునేందుకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో జర్నలిస్టులకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు బస్‌పాస్‌ల గడువును కూడా ఫిబ్రవరి 28, 2026 వరకు పొడిగించాలని ఐఅండ్‌పీఆర్ కమిషనర్ టీజీ ఆర్టీసీ ఎండీని కోరారు.