కరీంనగర్ విద్యానగర్, ఏప్రిల్ 9: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో ఓ ఉద్యోగి రూ.1.4 కోట్లు స్వాహా చేశారు. మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ ధనాన్ని కాజేసిన విషయాన్ని అధికారులు వెలికితీశారు. గతంలో పే-సెక్షన్లో పనిచేసిన ఓ ఉద్యోగి.. మరణించిన ముగ్గురు కానిస్టేబుళ్ల ఎంప్లాయ్ ఐడీలను ఉపయోగించి, ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో ఇతరుల పేర్లను నమోదు చేశాడు.
ఈ క్రమంలో ప్రైవేట్ బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి, తన వ్యక్తిగత మొబైల్ నంబర్లను అనుసంధానించడం ద్వారా 2022 నుంచి 2026 వరకు ప్రభుత్వ జీతాల సొమ్మును అక్రమంగా పొందినట్టు టాస్ఫోర్స్ ఏసీపీ విచారణలో తేలింది.