వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. వేములవాడ ఠాణాలో పని చేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ చంద్రప్రకాశ్ ఓ వ్యక్తి నుంచి రూ.6వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడు భరత్ బద్దిపోచమ్మ ఆలయం వద్ద చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 8న పక్కనే ఉన్న ముస్లిం వ్యాపారితో గొడవ జరిగింది.
దీంతో అదే రోజు ఇరువురు పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. 9న వేముల భరత్ కేసుకు సంబంధించి ఐఓగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ చంద్ర ప్రకాశ్ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసు నోటీసులు ఇచ్చాడు. స్టేషన్ బెయిల్ ఇప్పించినందుకు రూ.10వేలు ఇవ్వాలని హెడ్‌కానిస్టేబుల్ డిమాండ్ చేశాడని బాధితుడు ఆరోపించాడు.
ఆ తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించి.. చివరకు రూ.6వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో గురువారం పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న పండ్ల దుకాణం వద్దకు వచ్చిన హెడ్ కానిస్టేబుల్ చంద్రప్రకాశ్‌కు భరత్ డప్పులు ఇస్తుండగా.. అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తన బృందంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.