Phone Tapping case | ఫోన్ ట్యాపింగ్ కేసులోకి ఏసీబీ ఎంట్రీ..
ఫోన్ ట్యాపింగ్ కేసులోకి (Phone Tapping case) అవినీతి నిరోధక శాఖ (ACB) ఎంట్రీ ఇవ్వనుంది. పోలీసు అధికారుల అక్రమ ఆస్తులపై ఏసీపీ దృష్టిసారించింది.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులోకి (Phone Tapping case) అవినీతి నిరోధక శాఖ (ACB) ఎంట్రీ ఇవ్వనుంది. పోలీసు అధికారుల అక్రమ ఆస్తులపై ఏసీపీ దృష్టిసారించింది. ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రణీత్‌రావుతోపాటు ఇద్దరు అధికారులను అరుస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా రాజకీయ నాయకులు, వ్యాపారులు, హవాలా, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ డబ్బుతో విల్లాలు కొనుగోలు, ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరాతీస్తున్నారు. త్వరలోనే ఆయా అధికారుల ఇండ్లలో ఏసీబీ తనిఖీలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
ప్రణీత్‌రావు కస్టడీలో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎస్ఐబీ మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేయడంతో న్యాయస్థానం వాళ్లిద్దరికి 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ ముగ్గురు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇద్దరు ఏఎస్పీలను కస్టడీకి ఇవ్వాలంటూ ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు కోర్టును ఆశ్రయించడంతో నేడు ఈ పిటిషన్‌పై వాదనలు జరిగే అవకాశాలున్నాయి. మావోయిస్టులు, టెర్రరిస్టులు, దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని భావించే వారి ఫోన్ నంబర్లను అధికారికంగా దేశంతోపాటు ఆయా రాష్ట్రాల ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటాయి. దీనిని ఆసరగా చేసుకొని ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు పనిచేశారని విచారణలో విచారణలో తేలింది. ఎస్ఐబీలో ఎప్పటి నుంచి ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశారు? నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న సాప్ట్వేర్లు ఏమిటి? అనే అంశాలపై ప్రణీత్‌రావును ప్రత్యేక బృందం ప్రశ్నించినట్టు తెలిసింది.
మూసీ నుంచి హార్డ్‌డిస్క్ శకలాలు స్వాధీనం!
భుజంగరావు, తిరుపతన్నలు ప్రణీత్‌రావుపై అధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతోపాటు వ్యాపారులు, అక్రమ దందాలు చేసేవారి నంబర్లను ట్యాప్ చేసి అక్రమ సంపాదనకు కూడా తెరలేపినట్టు విచారణలో బయటపడింది. అక్రమ సంపాదనతో కొన్న ఆస్తులు బినామీల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించినట్టు పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. చాదర్‌ఘాట్ వద్ద మూసీలో పడవేసిన హార్డ్‌డిస్కుల శకలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. కాగా, ఎస్ఐబీలో పనిచేసే కొందరు అధికారులు ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతున్నట్టు తమకు సమాచారం ఉన్నదని, అలా చేయడం నేరమంటూ వారించడంతో తమను ఇతర విభాగాలకు బదిలీ చేశారంటూ కొందరు అధికారులు చర్చించకుంటున్నారు. అలాంటి వారిని కూడా ప్రస్తుతం దర్యాప్తు అధికారులు ఆరా తీసి, ఈ కేసులో సాక్షలుగా చేర్చే అవకాశాలున్నాయి.
టెక్నికల్ కన్సల్టెంట్..!
ఎస్ఐబీ టెక్నికల్ కన్సల్టెంట్‌గా పనిచేసిన రవి అనే వ్యక్తి ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ డివైస్, సాప్ట్వేర్లు తెప్పించారని విచారణలో బయటకు వచ్చింది. ఈ సాప్ట్‌వేర్‌ను ఉపయోగించి విపక్షాలు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారని చర్చ జరుగుతున్నది. ఫోన్ ట్యాపింగ్ చేయలంటే తప్పని సరిగా ఆయా సెల్‌ఫోన్ ప్రొవైడర్ల అనుమతి తప్పనిసరి. కానీ, నిబంధనలు ఉల్లంఘించి సాఫ్ట్వేర్లతో ఫోన్లను హ్యాక్ చేయడం చట్టపరిధిని దాటి చేయడమేనని కొందరు అధికారులు తెలిపారు. ఈ కేసులో టెక్నికల్ కన్సల్టెంట్‌ను పోలీసులు విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఇతడిచ్చే సమాచారంతో ఫోన్ హ్యాకింగ్ సాప్ట్‌వేర్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అసలు ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన సాప్ట్వేర్ ఏంటి అనే సమాచారాన్ని పోలీసులు తెలుసుకోనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

