ACB Raids | వనపర్తి జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ అధికారి
ACB Raids | ఓ అవినీతి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు (ACB Raids) రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
వనపర్తి : ఓ అవినీతి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు (ACB Raids) రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. భూమికి సంబంధించిన విషయంలో లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించి వలవేసి రెవెన్యూ అధికారిని పట్టుకున్నారు. వివరాలు .. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం తహసీల్ కార్యాలయంలో అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్(ARI) గా పనిచేస్తున్న అస్కాని నర్సింలు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు కార్యాలయంలో రూ. 5 వేలు లంచంb (Bribe) తీసుకుంటుండగా పట్టుకున్నారు.
మండల కేంద్రం గాంధీనగర్ కాలనీకి చెందిన జానకి రాములు అనే బాధితుడు తన తాతల పేరుమీద ఉన్న భూమిని వారసులమైన తమ పేరుమీదకు పట్టా మార్చి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఏఆర్వో లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం ఏసీబీ అధికారులు (ACB Officers) వ్యూహం ప్రకారం మాటువేసి ఏఆర్వో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అవినీతికి పాల్పడిన ఏఆర్వోపై కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరు పరిచామని ఏసీబీ డీజీ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. పబ్లిక్ సర్వెంట్లు ఎవరైనా లంచం అవినీతి,అక్రమాలకు పాల్పడితే ఏసీబీని సంప్రదించాలని ఆయన కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

