ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు
ప్రభుత్వ కార్యాలయాల్లో గురువారం ఏసీబీ అధికారులు దాడులు చేసి పలువురు అధికారులను పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం రాయదండికి చెందిన రైతు వెంకటస్వామి.. తన ఐదెకరాల భూమి ఇతరుల పేరుమీద ధరణిలో నమోదు కావడంతో దీనిపై విచారణ జరిపించాలని 6 నెలల క్రితం అంతర్గాం ఆర్ఐ శ్రీమాన్‌ను సంప్రదించాడు.
- రైతు నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా అంతర్గాం ఆర్ఐ శ్రీమాన్ పట్టివేత
- బోథ్‌లో మొక్కల బిల్లుల కోసం లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎఫ్ఆర్వో, జూనియర్ అసిస్టెంట్
అంతర్గాం/బోథ్, ఏప్రిల్ 9 : ప్రభుత్వ కార్యాలయాల్లో గురువారం ఏసీబీ అధికారులు దాడులు చేసి పలువురు అధికారులను పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం రాయదండికి చెందిన రైతు వెంకటస్వామి.. తన ఐదెకరాల భూమి ఇతరుల పేరుమీద ధరణిలో నమోదు కావడంతో దీనిపై విచారణ జరిపించాలని 6 నెలల క్రితం అంతర్గాం ఆర్ఐ శ్రీమాన్‌ను సంప్రదించాడు. ఆర్ఐ రూ.10వేల లంచం అడగడంతో రైతు ఏసీబీని ఆశ్రయించాడు. అంతర్గాం తహసీల్ ఆఫీస్‌లో రైతు వెంకటస్వామి నుంచి రూ.10వేలు తీసుకుంటున్న క్రమంలో ఆర్ఐని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
విచారణ అనంతరం ఆర్ఐపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ అటవీ రేంజ్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ రేంజ్ అధికారి ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ పరశురాం పట్టుబడ్డారని ఏసీబీ ఆదిలాబాద్ డీఎస్పీ మధు వెల్లడించారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద హరితహారంలో భాగంగా నాటిన మొక్కల బిల్లు రూ.5.09 లక్షలు ఇచ్చేందుకు ఎఫ్ఆర్వో, జూనియర్ అసిస్టెంట్ బాధితుడిని లంచం అడిగారు. సదరు బాధితుడు రూ.15 వేలు లంచం ఇస్తుండగా అధికారులు ఎఫ్ఆర్వోతోపాటు జూనియర్ అసిస్టెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

