Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు చెక్‌పోస్టుల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు చెక్‌పోస్టుల్లో 7 ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి. లెక్కలు చూపని నగదును ఏసీబీ బృందాలు సీజ్ చేశాయి. విష్ణుపురం చెక్‌పోస్టులో రూ. 86,500, భోరజ్(ఆదిలాబాద్) చెక్‌పోస్టులో రూ. 62,500, అలంపూర్ చెక్‌పోస్టులో రూ. 29,200 సీజ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ చెక్‌పోస్టుల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Dana Kishore | గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిశోర్.. ఉత్తర్వులు జారీ
Patnam Narender Reddy | పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు