హైదరాబాద్: రాష్ట్ర సరిహద్దుల్లోని రవాణా శాఖ చెక్పోస్టులపై (RTA Check Posts) ఏసీబీ ఏకకాలంలో దాడులు (ACB Raids) నిర్వహించింది. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని 6 చెక్‌పోస్టుల్లో అర్ధరాత్రి నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని క్రిష్ణా చెక్‌పోస్ట్, సంగారెడ్డి జిల్లా చిరాగ్పల్లి, కామారెడ్డి జిల్లాలోని సలాబత్పూర్, మద్నూర్ చెక్‌పోస్టులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట చెక్‌పోస్టు, కుమ్రం భీమ్ జిల్లాలోని వాంకిడి చెక్‌పోస్టుల్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా చెక్‌పోస్టుల్లో నగదును స్వాధీనం చేసుకున్నారు. వాహనాల నుంచి ప్రైవేట్ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేసింది. ఇటీవల కాలంలో రవాణా శాఖ చెక్పోస్టులపై ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహించడం ఇది రెండోసారి.