హైదరాబాద్, జనవరి 25 (నమస్తేతెలంగాణ): కామారెడ్డి జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంపై శనివారం ఏసీబీ అధికారులు దాడిచేసి రూ.44 కోట్ల విలువైన అక్రమ ధాన్యం నిల్వలను గుర్తించారు. 2021-22 ఖరీఫ్‌కు సంబంధించి 39 మిల్లర్లు అక్రమాలకు పాల్పడ్డారని, రూ.64 లక్షల విలువైన 581 మిలియన్ టన్నుల ధాన్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిల్వచేశారని ఆదివారం వెల్లడించారు. వాటిలో 2 రైస్ మిల్లులపై చర్యలకు సిఫారసు చేశామని తెలిపారు.
2022-23 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 37 మంది మిల్లర్లు రూ.41 కోట్ల విలువైన 19,529 మిలియన్ టన్నుల ధాన్యాన్ని అక్రమంగా నిల్వచేశారని, వాటిలో 2 రైస్ మిల్లులపై చర్యలకు సిఫారసు చేశామని చెప్పారు. 2023-24 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఏడుగురు మిల్లర్లు రూ.2.5 కోట్ల విలువైన 5,194 మిలియన్ టన్నుల ధాన్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిల్వచేసినట్టు గుర్తించామని, వాటిలో 3 మిల్లులపై చర్యలకు సిఫారసు చేశామని వివరించారు.