హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే కేసులో అరెస్టు అయిన కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్ బ్యాంకు లాకర్లలో రూ.5 కోట్ల నగదు, బంగారం, వెండి, వజ్రాలతో కూడిన ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
నూనె శ్రీధర్‌ను సోమవారం విచారించిన ఏసీబీ అధికారులు పలు విషయాలు రాబట్టారు. నిరుడు ఏసీబీ దాడుల్లో నూనె శ్రీధర్ వద్ద 100 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు.