 
                                                            మెదక్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): మెదక్ ట్రాన్స్‌కో డీఈ షేక్ షరీఫ్ చాంద్‌పాషా ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి పట్టుబడ్డారు. మెదక్ జిల్లా పాపన్నపేట మం డలం సీతారాంనగర్‌కు చెందిన రైతు భాస్కర్ ఈ నెల 27న ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం డీఈ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం రైతు నుంచి డీఈ రూ.21వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. బాధితుడు భాస్కర్ మా ట్లాడుతూ.. పౌల్ట్రీఫాం వద్ద 25 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం దరఖాస్తు చేయగా, రూ.2లక్షల 19 వేలు ఎస్టిమేషన్ వేశారని, డిపార్ట్మెంట్కు ఆ డబ్బు లు చెల్లించడంతో పాటు ఏఈ నుంచి డీఈ వరకు రూ.50వేలు లంచం అడిగారని తెలిపాడు.
అంత ఇచ్చుకోలేనంటే రూ. 30వేలు ఇ వ్వాలని డి మాండ్ చేశారన్నాడు. ఇం దులో రూ.9వేలు కొద్ది రోజుల ముందు ఫోన్ పే చేశానని, మిగతా రూ.21వేలు గురువారం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారని చె ప్పాడు. కేసు నమోదు చేసుకొని ట్రా న్స్‌కో డీఈని అరెస్ట్ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. మెదక్ పట్టణంలోని డీఈ షేక్ షరీఫ్ చాంద్ పాషా రూం వద్ద, మొహిదీపట్నంలోని అతని ఇంటి వద్ద సోదాలు కొనసాగుతున్నాయి.
 
                            