హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): లంచం తీసుకునేవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవినీతి నిరోధకశాఖ నుంచి తప్పించుకోలేరని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. అందుకు అడిషనల్ కలెక్టర్, భూపాల్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రెడ్డి నిదర్శనమని తెలిపారు.
ఏసీబీ బృందం చాకచక్యంగా వ్యవహరించి, అప్పటికప్పుడు ప్రణాళికలు మార్పు చేసుకుంటూ ఇద్దరినీ ట్రాప్ చేసిందని పేర్కొన్నారు.