Schools Closed | బాగు చేస్తామని.. బడుల ఎత్తివేత.. కాంగ్రెస్ సర్కార్ తీరుపై విద్యావేత్తల భగ్గు!
Schools Closed | ‘ఒక్క మార్పుతో మీ జీవితాలు మార్చుకోండి. మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మేమంతా మంచి చేస్తాం.. అంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు, తీరా అధికార పీఠమెక్కాక మంచి పనులు మానేసి.. ముంచే పనులు చేస్తున్నారు.
Schools Closed | హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : ‘ఒక్క మార్పుతో మీ జీవితాలు మార్చుకోండి. మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మేమంతా మంచి చేస్తాం.. అంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు, తీరా అధికార పీఠమెక్కాక మంచి పనులు మానేసి.. ముంచే పనులు చేస్తున్నారు. గారడీ మాటలు, భ్రమలతో అంతా కనికట్టు చేస్తున్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో అభివృద్ధి పథంలో దూసుకుపోయిన రాష్ర్టాన్ని ఇప్పుడు అధోగతిపాలు చేస్తున్నారు. రాష్ట్ర విద్యారంగమే ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నది. విద్యారంగాన్ని సంస్కరిస్తామంటూ అనేక హామీలు గుప్పించిన కాంగ్రెస్, అధికారం చేజిక్కించుకున్నాక అంతా గోల్మాల్ చేస్తున్నది. ప్రభుత్వ విద్యకు పాడె కడుతూ ఏకంగా వేల బడులను ఎత్తివేసే కుట్రకు పూనుకున్నది’.
హామీలతో మాయాజాలం..
‘మూతబడ్డ స్కూళ్లను తెరుస్తాం.. సింగిల్ టీచర్ స్కూళ్లను కొనసాగిస్తాం.. ఈ స్కూళ్లకు అదనంగా మరో టీచర్‌ను కేటాయిస్తాం.. మెగా డీఎస్సీ పేరిట 25వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం’ అని అనేక హామీలిచ్చారు. మ్యానిఫెస్టో పేరిట మాయాజాలం చేశారు. తీరా పీఠమెక్కాక విద్యావ్యవస్థ సవ్యంగా లేదన్నారు. తీరా ఇప్పుడు అదే బడులను మూసివేయబోతున్నారు. ఇచిన హామీలన్నింటినీ అటకెక్కించారు. ‘టీచర్లకు జీతాలెక్కువున్నాయి.. మొత్తం బడ్జెట్ టీచర్ల జీతాలకే పోతున్నది.. టీచర్లు రాజకీయాలు చేస్తున్నారు.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు తక్కువవున్నారు.. అంటూ పలుమార్లు ప్రభుత్వ పెద్దలు మాటలు చెప్పారు. తీరా ఇప్పుడు ఒకటో, రెండో కాకుండా ఏకంగా 23 వేల స్కూళ్లను మూసివేయబోతున్నారు.
బడ్జెట్ కేటాయింపులేవీ..
రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 15 శాతం నిధులు కేటాయిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టింది. ఈ లెక్కన ఏటా రూ.45వేల కోట్లను కేటాయించాలి. కానీ, ఈ రెండున్నరేండ్ల కాలంలో విద్యకు కేటాయించిన నిధులు కేవలం రూ.21వేల కోట్లు మాత్రమే. రేవంత్‌రెడ్డి సర్కార్ నియమించిన విద్యాకమిషన్ సైతం రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 18-20శాతం నిధులు కేటాయించాలని సిఫార్సు చేసింది. దీనిని కూడా పాటించిన దాఖలాల్లేవు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో విద్యకు 7.75 శాతం నిధులు, 2026-27 బడ్జెట్లో 8.2 శాతం నిధులు మాత్రమే కేటాయించింది. కాంగ్రెస్ సగం పాలన ముగిసింది. మిగతా సగంలో బడ్జెట్ పెంచే అవకాశాల్లేనట్టే. ఎందుకంటే 23 స్కూళ్లను మూసివేసిన తర్వాత బడ్జెట్ కేటాయింపులుండవన్నది విద్యారంగ నిపుణుల వాదన.
అల్పాహారానికి బ్రేక్
సర్కార్ బడుల్లోని విద్యార్థుల ఆకలి తీర్చడం, విద్యార్థుల హాజరును పెంచడం, డ్రాపౌట్రేట్ను తగ్గించడం వంటి లక్ష్యాలతో గత కేసీఆర్ సర్కార్ ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ పథకాన్ని ప్రారంభించింది. దశల వారీగా 3 వేలకు పైగా బడులకు ఈ పథకాన్ని విస్తరించింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఈ పథకాన్ని నిలిపివేసింది. రెండున్నరేండ్ల తర్వాత ఈ విద్యాసంవత్సరం నుంచి బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని పునః ప్రారంభించింది. ఈ పథకం 1,300కు పైగా బడులు, కాలేజీల్లోనే ప్రస్తుతం అమలవుతున్నది. ఇక మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులకు రూ.10వేల వేతనమిస్తామని కాంగ్రెస్ హామీనిచ్చింది. సర్కార్ బడుల్లో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించగా, ఈ పనిని వంట కార్మికులకు కాకుండా ప్రైవేట్ ఎన్జీవోలకు అప్పగించింది.
‘మన బడి’ బిల్లులు పెండింగ్..
రాష్ట్రంలో సర్కార్ బడుల రూపురేఖలు మార్చేందుకు కేసీఆర్ సర్కార్ చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ సర్కార్ విడుదల చేయలేదు. రూ.515.73 కోట్ల బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ మొత్తాన్ని విడుదల చేయాలని కాంట్రాక్టర్లు పలుమార్లు ధర్నాలకు దిగినా, సర్కార్ రూపాయి కూడా ఇవ్వలేదు. ఇందులో రూ.5 లక్షల లోపు బిల్లుల విలువ రూ.141.76 కోట్లు ఉన్నది. రూ.కోటి లోపున్న బిల్లులు రూ. 305 కోట్లు. అప్పులు తెచ్చి పనులు చేశామని, వడ్డీలు కట్టలేకపోతున్నామని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. అయినా కాంగ్రెస్ సర్కార్ కనికరించడంలేదు.
అటకెక్కిన కాంగ్రెస్ హామీలు..
- రాష్ట్ర బడ్జెట్లో విద్యకు ప్రస్తుతమున్న వాటా 6 నుంచి 15శాతానికి పెంచుతాం.
- ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు. మండల కేంద్రంలో హైస్కూల్, జూనియర్ కాలేజీ, నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజీ, జిల్లా కేంద్రంలో పీజీ కాలేజీ.
- ఖాళీగా ఉన్న అన్ని డీఈవో, ఎంఈవో పోస్టులను భర్తీ చేస్తాం.
- ఫీజు రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటుచేసి ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ.
- అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ. ఖాళీ టీచర్ పోస్టుల భర్తీ.
- ప్రతి విద్యార్థికీ రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు అందజేత.
- మధ్యాహ్న భోజన కార్మికుల నెలవారీ వేతనాన్ని రూ.10 వేలకు పెంపు.
- గతంలో మూసివేసిన 6 వేల స్కూళ్లను తిరిగి తెరుస్తాం.
- విద్యాజ్యోతి పథకం కింద పదో తరగతి పూర్తిచేసిన వారికి రూ.10వేలు, ఇంటర్ పాసైతే రూ.15వేలు, డిగ్రీ పూర్తిచేస్తే రూ.25వేలు, పీజీకి రూ.లక్ష వరకు స్కాలర్షిప్. ఎంఫిల్, పీహెచ్డీ పూర్తిచేసిన ఎస్సీ, ఎస్టీలకు రూ.5 లక్షల ప్రోత్సాహకం.
- ప్రతి మండలంలో నవోదయకు సమానమైన గురుకుల పాఠశాల. ప్రతి జిల్లాకూ కొత్త డిగ్రీ కాలేజీ ఏర్పాటు.
- ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పునరుద్ధరణ. డిగ్రీ, పీజీ కోర్సుల్లోని ఎస్టీ, ఎస్టీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం.
- విదేశీ వర్సిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు రూ.25లక్షల ఆర్థిక సాయం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

