హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : బడుల్లో ప్రతిరోజూ 90% విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. అంతేకాకుండా తరుచూ గైర్హాజరయ్యే విద్యార్థులను బడికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. టీచర్లు, అమ్మ ఆదర్శపాఠశాల కమిటీలు గైర్హాజరయ్యే విద్యార్థుల ఇంటికెళ్లి, తల్లిదండ్రులను ఒప్పించి బడికి వచ్చేలా చూడాలని పేర్కొన్నది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో 2026-27 విద్యాసంవత్సరం అకాడమిక్ క్యాలెండర్ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఆదివారం విడుదల చేశారు. కొత్త విద్యాసంవత్సరంలో బడులకు 227 పనిదినాలు (వర్కింగ్ డేస్)గా ఖరారు చేశారు. ఇక 2027 మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని క్యాలెండర్లో ప్రకటించారు. సర్కార్ బడుల్లో ఎన్రోల్మెంట్ పెంచేందుకు ఈ నెల 14 నుంచి 19 వరకు బడిబాట స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు.
కొన్ని ముఖ్యాంశాలు..
నెలవారీగా పనిదినాలు
నెల పనిదినాలు

