హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 14న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌ను తలపెట్టినట్టు ఏబీవీపీ శనివారం ప్రకటించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
నీట్ నిర్వహణలో విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణం రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు.