Telangana | దేవరుప్పుల, జూలై 19: సీఎం కేసీఆర్ చేపట్టిన జలయజ్ఞంతో సాగునీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో పడావు పెట్టి వలస బాట పట్టిన సన్న,చిన్నకారు రైతులు గ్రామాలకు చేరి వ్యవసాయం చేయడంతో కూలీల కొరత ఏర్పడింది. ఓ వైపు పత్తి, మరోవైపు వరి సాగు విస్తీర్ణం భారీగా పెరగడంతో తెలంగాణ రైతు పూర్తిగా వలస కూలీలపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. జనగామ జిల్లా దేవరుప్పుల గ్రామానికి పత్తి ఏరడానికి ఆంధ్రా, కర్ణాటక నుంచి కూలీలు రాగా, వరి నాట్లకు ఆంధ్రా నుంచి ఏటా వస్తున్నారు.
కృష్ణా జిల్లా నుంచి కూలీలు
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కుర్తివేణి మండలం పాండ్రక రామాపురం నుంచి దేవరుప్పులకు 25 మంది కూలీలు వలస వచ్చా రు. ఇక్కడే తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. దేవరుప్పులలో కూలీల కొరత అధికంగా ఉండటంతో రైతులు ముందుగానే వీరిని రిజర్వ్ చేసుకుంటున్నారు. ఎకరాకు 5,500 తీసుకుంటుండగా రోజుకు 6 ఎకరాల వరకు నాట్లు వేయడం వీరి ప్రత్యేకత. వరి నారు పీకడం, నారు పంచడం, నాటు వేయ డం పూర్తిగా వీరి బాధ్యతే. వీరికి గ్రామంలో వృథాగా ఉంటున్న వసతి గృహంలో వసతి కల్పించగా, ఉదయం 6 గంటలకు పొలంలో దిగి, చీకటి పడే వరకు నాట్లు వేయడం వేస్తున్నారు. నెల రోజుల వరకు చేతినిండా పని ఉండటంతో వలస కూలీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పనులు దొరక్క ఇక్కడికొచ్చాం
మా ఏరియాలో పనులు దొరక్క ఇక్కడికి వచ్చాం. కృష్ణా జిల్లాలో నాట్లు నెలపైన లేటవుతాయి. కూలీపైనే ఆధారపడ్డ మేమంతా ఉపాధి కోసం నెల క్రితం నల్లగొండ జిల్లా చిప్పలపల్లికి వచ్చాం. 15 రోజులు నాట్లేసి, దేవరుప్పులకు వచ్చాం. మేం 25 మందిమి ఉన్నాం. మా దగ్గర ఎకరాకు రూ.4,400 ఇస్తారు. ఇక్కడ రూ.5,500 ఇస్తున్నారు. రోజూ 6 ఎకరాలపైనే నాట్లు వేస్తాం. మొగోళ్లం నారు పంచడం, ఇతర పనులు చేస్తాం. ఆడోళ్లు నారు పీకి నాట్లు వేస్తారు. ఇప్పటికే 10 పది రోజులపని అడ్వాన్స్‌గా ఉన్నది.
– బొడ్డు నాగరాజు, రామాపురం, కృష్ణాజిల్లా
ఉపాధి కోసం వచ్చాం
ఏపీలో పనులు దొరక్క ఉపాధి కోసం తెలంగాణకు వలస వచ్చాం. నాట్ల పనుల కోసం ఇక్కడి వ చ్చాం. తెలంగాణ రైతులు మమ్మ ల్ని మంచిగ చూసుకుంటున్నరు. ఉం డడానికి చోటు ఇచ్చారు. నీటి వసతి ఉన్నది. చేస్తే నెల రోజుల పని ఉన్నది. ఉదయం చాయ్ తాగి 6 గంటలకే పొలానికి పోతాం. వంట చేయడానికి ఒక మనిషి ఉంటారు. సా యంత్రం చీకటిపడే వరకు పనులు చే స్తాం. కూలీ గిట్టుబాటు అయితేనే డబ్బులు మిగులుతాయి. 25 మంది గుంపు ఉన్నాం. అం తా రామాపురం గ్రామానికి చెందినోళ్లమే.
– శాంతకుమారి,వలస కూలీ, రామాపురం, ఏపీ