హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వానికి ఆర్థిక భారంకాని సీపీఎస్‌ను రద్దుచేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగం సంఘం కోరింది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ను విజ్ఞప్తిచేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డీ కమలాకర్, సహాధ్యక్షుడు మధుబాబు, కోశాధికారి వెంకట్‌నారాయణరెడ్డి ఆదివారం కోదండరాంతో భేటీ అయ్యారు. ఉద్యోగుల సమావేశంలో ఆర్థికభారంలేని సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. సీపీఎస్తోనూ ఎలాంటి ఆర్థికభారం లేదని, దానిని రద్దుచేసి, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.