Vemulawada | హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయం సమీపంలో ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆలయానికి సమీపంలో నిల్చున్న ఓ మహిళకు సదరు యువకుడు అసభ్యకరమైన సైగలు చేశాడు. పదేపదే అలానే సైగలు చేస్తుండడంతో భయాందోళనకు గురైన ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళకు అసభ్యకరంగా సైగలు చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని వెల్దండి సదానందంగా పోలీసులు గుర్తించారు. అనంతరం అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు టౌన్ సీఐ. కోర్టుకు సదానందంకు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.