మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, డిసెంబర్ 14 : మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహిస్తున్న పోలీస్ దేహదారుఢ్య పరీక్షల్లో ఓ యువతి ఎక్కువ ఎత్తు వచ్చేలా ఎత్తుగడ వేసి అడ్డంగా దొరికిపోయింది. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకొని ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన వనపర్తి జిల్లాకు చెందిన యువతి ఫిజికల్ ఈవెంట్స్‌కు హాజరైంది. సాధారణంగా 152.5 సెంటీ మీటర్ల ఎత్తు ఉండాలి. సెంటీమీటర్ ఎత్తు పెరగాలన్న ఉద్దేశంతో తలపై ఎంసీల్ (మైనం) పెట్టుకుని ఈవెంట్స్‌కు హాజరైంది.
ఈ యువతి నిల్చున్న సమయంలో ఎలక్ట్రానిక్ పరికరంలోని సెన్సర్ స్పందించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. మహిళా పోలీస్ అధికారి ఆమె తలను పరిశీలించగా.. వెంట్రుకల లోపల ఎంసీల్ అతికించుకున్నట్టు గుర్తించారు. అయితే ఆమెను డిస్ క్వాలిఫై చేస్తున్నట్టు మహబూబ్‌నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.