రామాయంపేట, జూన్ 16: ఆన్లైన్ బెట్టింగ్తో ఆర్థికంగా నష్టపోయిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన దొమ్మాట భానుప్రసాద్ (24) కొన్నిరోజులుగా ఆన్లైన్లో గేమ్‌లు ఆడుతున్నాడు.
ఆన్లైన్ బెట్టింగ్‌లు పెడుతూ రూ.1.50 లక్షలు పోగొట్టుకున్నాడు. తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఐదురోజుల క్రితం తన వ్యవసాయ బావివద్దకు వెళ్లి పురుగు మందు తాగాడు. వెంటనే కుటుంబీకులు రామాయంపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.